దారుణం.. కన్నకూతురని చూడకుండా వీడియో తీసి అలా చేసిన తండ్రి.. చివరికి

by  |

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఆత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వైఎస్ ఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కసాయిలా మారి 15 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసిన ఘటన జిల్లాలోని బెస్తవారిపేటలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. కన్నకూతురని కూడా చూడకుండా ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వైఎస్‌ఆర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. అంతే కాకుండా తాను ఓ వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయితే ఒక రోజు ఇంట్లో తన భార్య లేని సమయం చూసి కూతురిని వివాహేతర సంబంధం ఉన్న ఇంటి తీసుకవచ్చారు. అనంతరం కూతురికి మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ అత్యాచారం వీడియోను వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెను తీయమని చెప్పాడు. ఈ విషయాన్ని కూతురు తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story