- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాకలో దారుణం.. కరెంట్ షాక్‌తో కూతురిని చంపిన తండ్రి..
by Shyam |
<p>దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పెట్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి అభంశుభం తెలియని చిన్నారిని కరెంట్ షాక్‌తో హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ సంవత్సరం వయస్సున్న కూతురును కరెంట్ షాక్‌తో చంపి, అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. భార్య సునీతపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా భార్య భర్తల […]</p>

X
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు పెట్ గ్రామంలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి అభంశుభం తెలియని చిన్నారిని కరెంట్ షాక్‌తో హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ సంవత్సరం వయస్సున్న కూతురును కరెంట్ షాక్‌తో చంపి, అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. భార్య సునీతపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని, పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు ఇద్దరినీ సముదాయించడం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పాప మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ ఆర్విఎం ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






