- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి ఇచ్చినందుకు జైలుకు తీసుకొచ్చాడు
<p>దిశ, కుత్బుల్లాపూర్: లైసెన్సు లేకుండా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన యువకుడితో పాటు అతని తండ్రి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీకి చెందిన సోము పోచయ్య గత 28న ఓ పని నిమిత్తం తన ద్విచక్రవాహనాన్ని కొడుకు జగదీశ్‌కు ఇచ్చి పంపించాడు. జగదీశ్ సూరారం ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తూ రఘునాథ్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా […]</p>

దిశ, కుత్బుల్లాపూర్: లైసెన్సు లేకుండా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన యువకుడితో పాటు అతని తండ్రి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీకి చెందిన సోము పోచయ్య గత 28న ఓ పని నిమిత్తం తన ద్విచక్రవాహనాన్ని కొడుకు జగదీశ్‌కు ఇచ్చి పంపించాడు. జగదీశ్ సూరారం ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తూ రఘునాథ్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రఘునాథ్ చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో జగదీశ్‌కు లైసెన్సు లేదని తెలింది. ఒకరి మృతికి కారణమైన జగదీశ్‌తో పాటు లైసెన్సు లేని కొడుకుకు వాహనం ఇచ్చినందుకు తండ్రి పోచయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






