- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 ఏళ్ల బాలికపై 28 మంది అత్యాచారం.. మొదటి వ్యక్తి కన్నతండ్రే..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : నాన్న అంటే ఓ భరోసా. ధైర్యం. దిక్సూచి. అమ్మ నవ మాసాలు మోసి జన్మనిచ్చినా.. ఆ తర్వాత బాధ్యత మొత్తం తండ్రిదే. పొత్తిళ్ల పాప నుంచి అత్తారింటికి సాగనంపేదాక తండ్రే కీలకం. అలా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కామాంధుడై విష సర్పంలా కాటేశాడు. 17 ఏళ్ల కూతురుపై పైశాచికంగా అత్యాచారం చేయడంతోపాటు మరి కొందరికి అప్పగించి వరస అత్యాచారాలు చేయించాడు. వీరిలో బాలిక బంధువులు, ఓ ప్రధాన పార్టీ జిల్లా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : నాన్న అంటే ఓ భరోసా. ధైర్యం. దిక్సూచి. అమ్మ నవ మాసాలు మోసి జన్మనిచ్చినా.. ఆ తర్వాత బాధ్యత మొత్తం తండ్రిదే. పొత్తిళ్ల పాప నుంచి అత్తారింటికి సాగనంపేదాక తండ్రే కీలకం. అలా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కామాంధుడై విష సర్పంలా కాటేశాడు. 17 ఏళ్ల కూతురుపై పైశాచికంగా అత్యాచారం చేయడంతోపాటు మరి కొందరికి అప్పగించి వరస అత్యాచారాలు చేయించాడు. వీరిలో బాలిక బంధువులు, ఓ ప్రధాన పార్టీ జిల్లా అధ్యక్షుడు, అతడి అనుచరులు ఉండడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసులు, బాలిక కథనం ప్రకారం..
యూపీలోని లలిత్‌పూర్ జిల్లాకు చెందిన బాలిక (17) ఆరో తరగతి చదువుతుంది. ఆమెపై కన్నతండ్రి కన్ను పడింది. కూతురు మొబైల్‌కు తరచూ అసభ్యకర మెసేజ్‌లు, న్యూడ్ ఫొటోలు పంపిస్తూ లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లొంగదీసుకునే ప్రయత్నాలు చేశాడు. వాటన్నీటికి బాలిక లొంగకపోవడంతో ఓ రోజు ఆమెను బైక్‌పై బయటకు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను ఇంటికి తీసుకువచ్చి విషయం బయటకు చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో తల్లి కోసం బాలిక సైలెంట్ అయింది. దానినే అలుసుగా తీసుకున్న తండ్రి తరచూ తన కోరికలు తీర్చుకోవడంతోపాటు బయటి వ్యక్తులకు అప్పగించేవాడు.
తాను లైంగిక దాడి చేశాక బాలికను ఓ హోటల్‌కు తీసుకెళ్లి అక్కడి మహిళకు అప్పగించాడు. ఆమె బాలికకు మత్తు మందు ఇచ్చి ఇతరులతో సెక్స్ చేయించేది. ఇలా 28 మంది ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో కన్న తండ్రితోపాటు సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజ్‌హియా, బహుజన్ సమాజ్ పార్టీ దీపక్ అహిర్వార్, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నేతలు, బాలిక బంధువులు ఉన్నారు. నొప్పి తట్టుకోలేక కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా ఏ ఒక్కరూ వదలలేదని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తీవ్రంగా హింసించి సెక్స్ కోరికలు తీర్చుకున్నారని విలపించింది. డబ్బుల కోసం తనను అమ్మేందుకు కూడా ప్రయత్నించారని తెలిపింది.
కాగా, ఈ కేసుపై లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ స్పందించారు. బాలిక ఫిర్యాదు మేరకు ఎఫ్ఆర్ఐ నమోదు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు. ఈ కేసుపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని, మేజిస్ట్రేట్ సమక్షంలో బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఈ కేసుపై సమాజ్ వాది పార్టీ నేత తిలక్ యాదవ్ స్పందించారు. తనను, తన సోదరులను కావాలనే ఈ అత్యాచారం కేసులో ఇరికించారని తెలిపారు.






