- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు అంత్యక్రియలు నిర్వహించి.. అదే స్మశానంలో ఊరేసుకున్న తండ్రి
<p>దిశ, ఖమ్మం రూరల్: కన్న తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఈ నెల 17న పదో తరగతి విద్యార్థి భానుప్రకాష్ మృతిచెందాడు. కొడుకు చితి ఆరకముందే తీవ్ర మనస్థాపం చెందిన తండ్రి చల్లా రాంబాబు(48) శనివారం రాత్రి అదే స్మశానవాటికలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన చల్లా రాంబాబు ఫ్యామిలీ జీవనోపాధి నిమిత్తం ఖమ్మం రూరల్‌మండలం పెద్దతండా టెంపుల్సీటిలో నివాసం ఉంటుంది. రాంబాబుకు ఒక కొడుకు భానుప్రకాష్, కుమార్తె ఉన్నారు. కుమారుడు […]</p>

దిశ, ఖమ్మం రూరల్: కన్న తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఈ నెల 17న పదో తరగతి విద్యార్థి భానుప్రకాష్ మృతిచెందాడు. కొడుకు చితి ఆరకముందే తీవ్ర మనస్థాపం చెందిన తండ్రి చల్లా రాంబాబు(48) శనివారం రాత్రి అదే స్మశానవాటికలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లికి చెందిన చల్లా రాంబాబు ఫ్యామిలీ జీవనోపాధి నిమిత్తం ఖమ్మం రూరల్‌మండలం పెద్దతండా టెంపుల్సీటిలో నివాసం ఉంటుంది. రాంబాబుకు ఒక కొడుకు భానుప్రకాష్, కుమార్తె ఉన్నారు. కుమారుడు భానుప్రకాష్ ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్చదువుతున్నాడు. ఈ నెల 14న తన పుట్టిరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించుకున్నాడు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో భానుప్రకాష్‌ను తల్లిదండ్రులు మందలించడంతో మరుసటి రోజైన 15న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి రాంబాబు వెంటనే చికిత్స నిమిత్తం హస్పిటల్‌కు తరలించాడు. చికిత్స పొందుతూ శుక్రవారం భానుప్రకాష్ మృతిచెందాడు. భానుప్రకాష్ అంత్యక్రియలను స్వగ్రామమైన సత్తుపల్లిలో నిర్వహించారు. శనివారం తండ్రి కూడా అదే స్మశానవాటికలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పాఠశాల యాజమాన్యం మా కుమారుడి మృతికి కారణం: తల్లి ఆరోపణ
గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని, ఇంకా నాలుగు నెలలు గడిస్తే మా కుమారుడి ప్రాణాలు దక్కేవని, పాఠశాల యాజమాన్యం వల్లే మా బాబు మృతిచెందాడని తల్లి ఆరోపించింది. కుమారుని మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.






