- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగ్రహంలో అన్నదాతలు.. మంథని టు గోదావరిఖని రోడ్డు బ్లాక్
by Sridhar Babu |
<p>దిశ, మంథని : కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ పంటలు మునిగిపోయాయని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మంథని టు గోదావరిఖని ప్రధాన రహదారి సిరిపురం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మూడు సార్లు తమ పంటలు బ్యాక్ వాటర్ వలన నష్టపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు గంట పాటు రైతులు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు […]</p>

X
దిశ, మంథని : కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ పంటలు మునిగిపోయాయని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మంథని టు గోదావరిఖని ప్రధాన రహదారి సిరిపురం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మూడు సార్లు తమ పంటలు బ్యాక్ వాటర్ వలన నష్టపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు గంట పాటు రైతులు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో మంథని ఎస్‌ఐ చంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సాయంత్రంలోగా సర్వే జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
Next Story






