- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా భూములు ఇవ్వం.. సర్వేను అడ్డుకున్న రైతులు
<p>దిశ, పరకాల: నాగపూర్ నుండి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ హైవే అథారిటీ వారు నిర్దిష్ట రూట్ మ్యాప్‌ను రూపొందించడంలో భాగంగా సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన మాదారం, మలకపేట రెవెన్యూ పరిధిలోని భూముల్లో సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వే చేస్తున్న అధికారుల వద్దకు చేరుకొని తమ […]</p>

దిశ, పరకాల: నాగపూర్ నుండి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ హైవే అథారిటీ వారు నిర్దిష్ట రూట్ మ్యాప్‌ను రూపొందించడంలో భాగంగా సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం హన్మకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన మాదారం, మలకపేట రెవెన్యూ పరిధిలోని భూముల్లో సర్వే చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు సర్వే చేస్తున్న అధికారుల వద్దకు చేరుకొని తమ భూములను గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇవ్వబోమంటూ అడ్డుకున్నారు.
సారవంతమైన భూముల్లో అభివృద్ధి పేరుతో రోడ్లు నిర్మిస్తే, భవిష్యత్ తరాలు ఏం తిని బతకాలంటూ రైతులు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను నిలదీశారు. సర్వేని అడ్డుకున్న విషయం తెలుసుకొని పరకాల తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి వెంటనే అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేంలేక సర్వేను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా సర్వే పనులను త్వరలోనే కొనసాగిస్తామని తెలియజేశారు.






