కేజీఎఫ్ హీరో తల్లిపై పోలీసులకు ఫిర్యాదు

107

దిశ, సినిమా: కేజీఎఫ్ హీరో యశ్ తల్లి పుష్పలతపై ఫైర్ అవుతున్నారు కర్ణాటక హాసన్ జిల్లా తిమ్మాపూర్ గ్రామస్తులు. యశ్ స్వగ్రామం హాసన్ కాగా.. సమీపంలోని తిమ్మాపూర్‌లో ఇటీవల 80 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అయితే యశ్ తల్లి ఈ భూమి అంతటికీ కంచె వేయించడంతో తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేదంటూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు. ఎన్నిసార్లు అడిగినా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దుద్ద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు.

ఈ మేరకు ఇరు వర్గాలతో చర్చించేందుకు పోలీసులు నిర్ణయించగా.. అక్కడికి చేరుకున్నారు యశ్. కాగా గ్రామ పటంలో ఉన్నట్లు తమకు దారి ఇవ్వాలని, 80 ఏకరాలకు కంచె వేస్తే తమ భూములు ఎలా సాగు చేసుకుంటామని ప్రశ్నించారు రైతులు. కాగా యశ్ రాకతో అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..