పంటలు పండించి.. ఆందోళన చేయాలా..?

by  |
పంటలు పండించి.. ఆందోళన చేయాలా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లాలో రైతులు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. ఏ ఒక్కరూ మక్కలు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట మండలం ఆర్గోండ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నను అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆందోళనకు దిగారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో సమీపంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. సొసైటీ కేంద్రంలో కొందరి పేర్లే నమోదు చేసుకోని కొనుగోళ్లు చేస్తున్నారని, పేర్లు లేని వారి మక్కలను తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కలను కొనుగోలు చేసే వరకు సెల్ టవర్ దిగమని భీష్మించుకుని కూర్చున్నారు. పంటలను పండించి.. వాటిని కొనండి అని ఆందోళన చేస్తేనే కొంటారా.. ? అని ప్రశ్నించారు. సొసైటీ అధికారులు నచ్చజెప్పినా రైతులు టవర్ దిగలేదు.


Next Story