- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిహారమిస్తరా, భూములిస్తరా..? ప్రభుత్వానికి రైతుల వార్నింగ్
<p>దిశ, మణుగూరు : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయని సంబురపడ్డాం. కానీ ఇదే ప్రభుత్వం రైతుల పొట్టమీద కొడుతుందని ఊహించలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు శనివారం చేపట్టిన నిరాహారదీక్ష 73వ రోజుకు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు పంటలు పండే మా భూములు మాకు ఇస్తారా.. న్యాయం […]</p>

దిశ, మణుగూరు : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయని సంబురపడ్డాం. కానీ ఇదే ప్రభుత్వం రైతుల పొట్టమీద కొడుతుందని ఊహించలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు శనివారం చేపట్టిన నిరాహారదీక్ష 73వ రోజుకు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు పంటలు పండే మా భూములు మాకు ఇస్తారా.. న్యాయం చేస్తారా..? అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదని భూ నిర్వాసితులు ఆరోపించారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులు వ్యాఖ్యానించారు. 250 ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వకుండా.. నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే మేము ఎలా బతకాలని నిరాహారదీక్ష ప్రాంగణంలో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.ఎకరాకు 25 లక్షల రూపాయలు చెల్లించి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ దీక్షలో పాల్గొన్నది పినపాక కాళేశ్వరరావు, దాసరి సత్యనారాయణ, నేలపట్ల సత్యనారాయణ రెడ్డి, నేలపట్ల రవీందర్ రెడ్డి, నేలపట్ల సోమశేఖర్ రెడ్డి తదితర రైతులు దీక్షలో పాల్గొన్నారు.






