- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా భూములు లాక్కోవద్దు : రైతులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఆ ప్రాంతంలోని రైతుల భూములపై అధికారులు కన్నేశారు. సమాచారం అందుకున్న రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన చేపట్టారు. 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇప్పటికే తమ ప్రాంతంలో ఏర్పాటైన ఫార్మా కంపెనీల కాలుష్యంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఆ ప్రాంతంలోని రైతుల భూములపై అధికారులు కన్నేశారు. సమాచారం అందుకున్న రైతులు తమ భూములు లాక్కోవద్దంటూ ఆందోళన చేపట్టారు. 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇప్పటికే తమ ప్రాంతంలో ఏర్పాటైన ఫార్మా కంపెనీల కాలుష్యంతో వ్యాధి బారిన పడుతుండటంతో, భూములు ఇచ్చేందుకు పేదలు నిరాకరిస్తున్నారు. చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామంలో 150 మంది దళిత, నిరుపేద రైతుల నుంచి 62 ఎకరాల సైన్డ్ భూములకు అధికారులు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
Next Story






