- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి..
<p>దిశ, జగదేవపూర్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అంతాయిగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హేమ కొండయ్య (65)వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పొలం పనుల నిమిత్తం బోరు బావి వద్దకు వెళ్లాడు. షాటర్ డబ్బాను సరిచేయడానికి వెళ్లగా డబ్బాలో ఉన్న […]</p>

దిశ, జగదేవపూర్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అంతాయిగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హేమ కొండయ్య (65)వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పొలం పనుల నిమిత్తం బోరు బావి వద్దకు వెళ్లాడు.
షాటర్ డబ్బాను సరిచేయడానికి వెళ్లగా డబ్బాలో ఉన్న కరెంటు వైరు కొండయ్య చేతిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొండయ్యకు షాక్ తగిలిన విషయం గమనించిన పొలం ప్రక్కన ఉన్న రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెళ్లి చూడగా కొండయ్య మృతి చెంది కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ హాస్పిటల్ కు తరలించారు.






