ఫారెస్ట్ అధికారుల చేసిన పనికి పురుగుల మందు తాగిన రైతు

by  |
ఫారెస్ట్ అధికారుల చేసిన పనికి పురుగుల మందు తాగిన రైతు
X

దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు చేసిన పనికి ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన రైతు భూక్య హుస్సేన్‌కు బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో సర్వే నెం 90లో 10 ఎకరాల భూమి ఉంది. శనివారం సర్వే నెం 90లో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది జామాయిల్ మొక్కలు నాటుతుండగా భూక్య హుస్సేన్ అడ్డుకున్నాడు. సర్వే నెంబర్ 90లోని భూమికి హైకోర్ట్ తీర్పు ఉందని, జామాయిల్ మొక్కలు నాటవద్దని అన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు జామాయిల్ మొక్కలు నాటుతుండగా మనస్థాపం చెంది భూక్య హుస్సేన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed