రౌడీతో రొమాన్స్ కోసం వెయిటింగ్ : జాతిరత్నాలు హీరోయిన్

by  |
రౌడీతో రొమాన్స్ కోసం వెయిటింగ్ : జాతిరత్నాలు హీరోయిన్
X

దిశ, సినిమా : జాతిరత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ సాంగ్‌ యూత్‌కు కనెక్ట్ అయింది. ఎట్ ఏ టైమ్ తన క్యూట్ స్మైల్‌ అండ్ ఎక్స్‌‌ప్రెషన్స్‌తో పాటకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చిన హీరోయిన్ కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది. ఈ కొత్త అందాన్ని ఊహించుకుంటూ కుర్రకారు అప్పుడే పాటలు కూడా పాడేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు పేరు ఫరియా అబ్దు్ల్లా కాగా.. అసలు ఈ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

థియేటర్ ఆర్టిస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫరియా.. లయోలా కాలేజీలో చదివింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాజరయ్యారని, అప్పుడు తనను కలిసి సినిమాల మీద ఇంట్రెస్ట్ గురించి వివరించానని తెలిపింది. దీంతో ఈ సినిమా ఆడిషన్‌కు పిలిపించి తనను సెలెక్ట్ చేశారని చెప్పింది. నవీన్ పొలిశెట్టితో నటించడం బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటున్న హీరోయిన్.. నటుడు ఫాహద్ ఫజిల్‌తో నటించాలనేది తన కల అని వివరించింది. అంతేకాదు తెలుగులో విజయ్ దేవరకొండతో స్క్రీన్ రొమాన్స్ చేయాలనుందని తన మనసులో మాట చెప్పేసింది ఫరియా.


Next Story

Most Viewed