కొవిడ్ వ్యాక్సిన్ ధరలపై హీరో ట్వీట్ వైరల్

by  |
కొవిడ్ వ్యాక్సిన్ ధరలపై హీరో ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో ఫర్హాన్ అక్తర్.. తన ఎపిక్ రిప్లైస్‌తో ట్రోలర్స్ నోరు మూయించడంలో దిట్ట. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాక్సిన్ల అధిక ధరలపై ఫార్మాస్యూటికల్ కంపెనీలను ప్రశ్నించిన ఫర్హాన్‌కు.. మధ్యలో కల్పించుకుని లెక్చర్ ఇచ్చిన కంగనా అండ్ టీమ్‌కు బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు. 150కు వ్యాక్సిన్ సేల్ చేసినా లాభాలు వచ్చే అవకాశం ఉండగా, సీరమ్ కంపెనీ ఒక్క డోస్ వ్యాక్సిన్ కోసం రూ. 600 కలెక్ట్ చేయడం ఎందుకని క్వశ్చన్ చేశాడు. ఈ ఇష్యూపై సీరమ్ ఇనిస్టిట్యూట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా.. మధ్యలో కలగజేసుకున్న కంగన దీనిపై అనవసర రాద్ధాంతం చేసింది. ఎకనామిక్స్, పీపుల్స్ అంటూ లేనిపోని లెక్చర్లు ఇచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత గవర్నమెంట్ కూడా తక్కువ ధరకు వ్యాక్సిన్ అమ్మాలని కోరడంతో.. తనను ట్రోల్ చేసిన కంగన అండ్ టీమ్‌కు సరైన సమాధానమిస్తూ ట్వీట్ చేశాడు ఫర్హాన్.

‘మై డియర్ ట్రోలర్స్.. గవర్నమెంట్ కూడా తక్కువ ధరకే వ్యాక్సిన్ ఇవ్వాలని కోరింది. మీరు నాకిస్తున్న ఎకనామిక్స్ ఉపన్యాసాలతో వారి టీమ్ లీడర్‌ను చిత్తడి చేశారు అనుకుంటున్నా. మళ్లీ మీ స్పీచ్ టైమ్ వచ్చే వరకు మాస్క్ వేసుకోండి. ఇంట్లో ఉండి నోరు కడుక్కోండి.. అంటే చేతులు’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మరో వ్యక్తి ‘మీరు కూడా అలాగే చేయండి, లేదంటే కరోనా వ్యాప్తి చెందుతుంది’ అని సమాధానమివ్వగా.. ‘నీ అడ్రస్ ఇవ్వు.. కొత్త జోకుల పుస్తకం పంపిస్తాను’ అని రిప్లై ఇచ్చాడు.



Next Story

Most Viewed