పండగ బరిలో పవర్ స్టార్?

by  |
పండగ బరిలో పవర్ స్టార్?
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఏదేమైనా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూడాల్సిందే. ఇది చాలా మంది డ్రీమ్ కూడా. ఇక థియేటర్ దగ్గరైతే ఓ పెద్ద పండగ వాతావరణమే నెలకొంటుంది. పైగా ఇప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’తో వస్తుండటంతో ఈ సారి సెలబ్రేషన్స్ మరింత జోష్‌ఫుల్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా విడుదల గురించి మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు.

లాక్‌డౌన్‌కు ముందు విడుదల కావాల్సిన సినిమాలు చాలా వరకు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. కానీ ‘వకీల్ సాబ్’ గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్. దీంతో అసలు సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా? అనే అయోమయంలో ఉన్నారు అభిమానులు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియా రికార్డులు సెట్ చేయగా.. సినిమా విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.



Next Story

Most Viewed