- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి..!
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. కరోనా వైరస్ సోకిన వేణుగోపాల్.. గత 23 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఆయన కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వేణుగోపాల్ స్వస్థలం. ఎఫ్‌సీఐ మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. కోసూరి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. కరోనా వైరస్ సోకిన వేణుగోపాల్.. గత 23 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఆయన కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వేణుగోపాల్ స్వస్థలం. ఎఫ్‌సీఐ మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. కోసూరి వేణుగోపాల్ తనదైన స్టైల్లో ఓ డైలాగ్ డిక్షన్ ఏర్పర్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. మర్యాద రామన్న, పిల్లజమిందారు, చలో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.






