- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాక్ డౌన్ కష్టాలు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
<p>న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పేదలు పనిదొరక్కపోవడంతో కడుపు మాడ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం చండీగఢ్ పోలీసులకు ఓ మహిళ ఫోన్ చేసింది. తమకు ఇంట్లో తినడానికి తిండి లేదనీ, అనారోగ్యంతో […]</p>

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పేదలు పనిదొరక్కపోవడంతో కడుపు మాడ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తినడానికి తిండి కూడా దొరకడం లేదంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఆదివారం ఉదయం చండీగఢ్ పోలీసులకు ఓ మహిళ ఫోన్ చేసింది. తమకు ఇంట్లో తినడానికి తిండి లేదనీ, అనారోగ్యంతో ఉన్న బిడ్డకు ముందులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయింది. తమ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడుతున్నామని తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు.. హుటాహుటిన బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరంతమ బిడ్డ వైద్యానికి ఆర్థిక సహాయం చేసి, అవసరమైన ఆహారాన్ని అందించి ఆదుకున్నారు.
Tags: lockdown, chandigarh, faimily attempted to suicide, corona, virus,






