ముంబయిలో ఫేక్ వ్యాక్సిన్ కలకలం

by Shamantha N |

<p>ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే మరోవైపు నకిలీ మాఫియా పట్టిపీడిస్తున్నది. కరోనా భయంతోనూ వ్యాపారం చేసుకుంటూ నకిలీ టీకాలు వేసి సొమ్ముచేసుకున్న ఘటన ఇక్కడ వెలుగుచూసింది. మొత్తం 2,053 మందికి నకిలీ టీకా వేశారని బాంబే హైకోర్టుకు పోలీసులు తెలిపారు. ముంబయిలో ప్రైవేటు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి ఈ దారుణానికి పాల్పడ్డారని వివరించారు. కాందీవలి(వెస్ట్)లోని హీరానందని హెల్త్ క్లబ్‌లో 390 మందికి, పరేల్‌లోని పోదర్ ఎడ్యుకేషన్ సొసైటీలో 207 [&hellip;]</p>

Covid-19 vaccine wastage:
X

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని ఒకవైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే మరోవైపు నకిలీ మాఫియా పట్టిపీడిస్తున్నది. కరోనా భయంతోనూ వ్యాపారం చేసుకుంటూ నకిలీ టీకాలు వేసి సొమ్ముచేసుకున్న ఘటన ఇక్కడ వెలుగుచూసింది. మొత్తం 2,053 మందికి నకిలీ టీకా వేశారని బాంబే హైకోర్టుకు పోలీసులు తెలిపారు. ముంబయిలో ప్రైవేటు వ్యాక్సినేషన్ క్యాంపులు నిర్వహించి ఈ దారుణానికి పాల్పడ్డారని వివరించారు. కాందీవలి(వెస్ట్)లోని హీరానందని హెల్త్ క్లబ్‌లో 390 మందికి, పరేల్‌లోని పోదర్ ఎడ్యుకేషన్ సొసైటీలో 207 మందికి, బొరివలిలో 514 మందికి, మలద్ వెస్ట్‌లో 30 మందికి, ఖార్‌లోని టిప్స్ ఇండస్ట్రీస్‌‌లో నిర్వహించిన క్యాంపులో 365మంది ఉద్యోగులు సహా ఇతర ప్రాంతాల్లో ఈ టీకాలు వేశారని పేర్కొన్నారు. ఈ ఉదంతం తెలియగానే నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు. వివరాలపై ఆందోళన చెందిన ఉన్నత న్యాయస్థానం ఫేక్ వ్యాక్సిన్‌లు తీసుకున్న వీరందరి ఆరోగ్యం ఎలా ఉన్నదని అడిగింది. వారిని గుర్తించి యాంటీబాడీల టెస్టు చేయాలని, ఫేక్ టీకాల ప్రభావమెంత ఉన్నదో కనుక్కోవాలని మహారాష్ట్రకు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌(బీఎంసీ)కు తెలిపింది. తర్వాత సరైన రీతిలో టీకాలు వేయాలని సూచించింది. వెంటనే ఈ నకిలీ టీకా దందాను అరికట్టాలని, అందుకు తగిన పాలసీని రూపొందించాలని ఆదేశించింది. ప్రతి నిమిషం ముఖ్యమైనదేనని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కొవిన్‌లో నమోదు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తున్నది. పిటిషన్ ఉటంకించిన నకిలీ టీకాలపై స్పందిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Next Story