- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TTD: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. రంగంలోకి విజిలెన్స్..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కొందరు దుండగులు నకిలీ టికెట్లను అంటగట్టారు. అందుకు అనుగుణంగానే వారి నుంచి భారీగా దోచుకున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను మార్ఫింగ్ చేసి రూ. 4400లకు కొందరు దళారులు విక్రయించినట్టు తెలుస్తోంది. సాధారణంగా కేటాయించిన టికెట్ల కంటే ఎక్కువ మంది స్వామి వారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నకిలీ టికెట్ల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కొందరు దుండగులు నకిలీ టికెట్లను అంటగట్టారు. అందుకు అనుగుణంగానే వారి నుంచి భారీగా దోచుకున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను మార్ఫింగ్ చేసి రూ. 4400లకు కొందరు దళారులు విక్రయించినట్టు తెలుస్తోంది.
సాధారణంగా కేటాయించిన టికెట్ల కంటే ఎక్కువ మంది స్వామి వారిని దర్శించుకుంటున్నట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నకిలీ టికెట్ల వలన టీటీడీకి కూడా పెద్దమొత్తంలో నష్టం వాటిల్లినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మార్ఫింగ్ టికెట్లపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. తిరుపతిలోని ట్రావెల్స్ నిర్వాహకులే ఈ ఘనకార్యానికి మూల కారకులు అయ్యి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story






