Fake sim cards: మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? తెలుసుకోండిలా..

by Anukaran |
Fake sim cards: మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? తెలుసుకోండిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో రోజుకో మోసం వెలుగు చూస్తునే ఉంది. అయితే మీ ఐడి కార్డులతో ఎవరైనా సిమ్ తీసుకున్నారనే అనుమానం మీకు ఉందా… మీ పేరుమీద ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి..? అనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలికాం విభాగం తాజాగా ప్రత్యేక పోర్టల్‌ను విడుదల చేసింది. ఈ పోర్టల్ ద్వారా మీ పేరు మీద ఎవరైనా ఫేక్ సిమ్ తీసుకుంటే..మీరే బ్లాక్ చేసేందుకు అవకాశం కూడా కల్పించింది. అది ఎలాగంటే..

  • ముందుగా మీరు ప్రభుత్వ పోర్టల్ https://tafcop.dgtelecom.gov.in/alert.php లోకి వెళ్లాలి

  • అక్కడికి వెళ్లగానే మొదట మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడంతో ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.

  • అప్పడు మీ పేరు మీద యాక్టీవ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి.

  • మీకు కనిపించే వాటిలో మీకు తెలియని నెంబర్ ఎదైనా ఉంటే.. దానిపై క్లిక్ చేసి బ్లాక్ చేయమని రిక్వెస్ట్ పెట్టవచ్చు.

  • ఇలా రిక్వెస్ట్ పెట్టిన తరువాత.. టెలికాం సంస్థ రిక్వెస్ట్ ఐడీని కంప్లైంట్ ఇచ్చిన వినియోగదారుడికి పంపుతారు. ఆ ఐడీ ద్వారా మీ రిక్వెస్ట్‌ను ట్రాక్ చేయవచ్చు.

మరేందుకు అలస్యం..ఒకసారి ట్రైచేసి చూడండి.



Next Story

Most Viewed