నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

by  |
నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
X

దిశ, మునుగోడు:
నకిలీ బంగారం అమ్ముతున్న నలుగురు ముఠా సభ్యులను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాలకు చెందిన తమ్మిశెట్టి నాగరాజు, మల్లెల సురేష్, అచ్చి కోటేశ్వరరావు, గంజి దుర్గయ్యలు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు. మొదటగా ఈ ముఠా వన్ గ్రామ్ ప్యూరిటీ గోల్డ్‎ను తక్కువ ధరకు విక్రయించి కస్టమర్లకు నమ్మకాన్ని కల్పిస్తారు. దీంతో కస్టమర్లు తక్కువ ధరకు బంగారం వస్తుందనే ఆశతో మరికొంత కొనుగోలుకు సిద్ధమైనప్పుడు వారికి నకిలీ బంగారాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటారు. నకిలీ బంగారం అమ్మిన తర్వాత వారు అక్కడ కనిపించరు. గత కొన్ని రోజుల క్రితం చౌటుప్పల్‎లో మకాం వేసిన ఈ ముఠా.. హోండా బైక్ షో రూమ్‎లో పనిచేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని నమ్మించి నకిలీ బంగారం అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారం అందుకున్న నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.

గతంలో వీరందరూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో 40కిపైగా నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరంతా ఈ నేరాల్లో జైలు శిక్ష అనుభవించి విడుదల అయినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.లక్ష నగదు, రెండు బైకులు, ఆరు సెల్‎ఫోన్లు, 900 గ్రాముల నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‎లో రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో ఎల్బీనగర్ సీసీఎస్, చౌటుప్పల్ పోలీసులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed