నకిలీ కరెన్సీ ముద్రణ.. ఇద్దరి అరెస్టు

72

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో స్నేహితులతో కలిసి య్యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తు సతీష్ అనే వ్యక్తి దొంగనోట్లు ముద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే బట్టల దుకాణంలో సతీష్ ఇచ్చిన కరెన్సీపై అనుమానం రావడంతో వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సతీష్, జగదీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తమ నేరాన్ని అంగీకరించారు. నకిలీ కరెన్సీ, ప్రింట్ చేసేందుకు వాడిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.