ఈ రాత్రికి కోరిక తీరుస్తేనే నీ కూతురికి వైద్యం చేస్తానని అల్టిమేటం.. దీంతో ఆ తల్లి..

by  |
Dhonga-baba-arrest1
X

దిశ, సూర్యాపేట రూరల్: తమ సమస్యలను తీర్చాలని ఆశ్రయించిన వారిపై కన్నేశాడో దొంగ బాబా. తన మంత్రశక్తులతో, నాటు వైద్యంతో రుగ్మతలను పారాదోలుతానంటూ నమ్మించడంతో తమ సమస్యలను తీర్చాలంటూ పలువురు ఆ దొంగ బాబాను ఆశ్రయించారు. అయితే, సమస్యను తీర్చాలంటే ముందుగా తన కోరిక తీర్చాలంటూ కండీషన్ పెట్టి మహిళలను లోబరుచుకుంటున్నాడని.. మాట విననివారిపై మంత్రాలు ప్రయోగించి ప్రాణాలు తీస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. ఈ దొంగ బాబా వ్యవహారం మంగళవారం సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం నుండి కాపాడాలంటూ దర్గా నిర్వాహకుడిని ఆశ్రయిస్తే తన కామ వాంఛ తీర్చాలని కోరాడని, దానికి ఒప్పుకోకపోవడంతో మంత్రాలు చేసి తమ కూతురిని హతమార్చాడంటూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలోని గాంధీ నగర్ సమీపంలో గల దర్గా వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురి మృతికి కారణమంటూ దర్గా నిర్వాహకుడిని నిర్బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోరిక తీరుస్తేనే..

చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, రాజరాజేశ్వరి కుటుంబం తమకు ఏదైనా సమస్య వస్తే గాంధీ నగర్ సమీపంలోని దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసే వారు. ఆ దర్గా నిర్వాహకుడు భిక్షపతి ఇచ్చే నాటు మందులు వాడేవారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా దర్గా వద్దకు వస్తుండటంతో దర్గా నిర్వాహకుడి కన్ను రాజరాజేశ్వరిపై పడింది. ఎలాగైనా ఆమెను లోబరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం దుర్గయ్య, రాజరాజేశ్వరిల కూతురు శ్రావణి(20) అనారోగ్యానికి గురికావడంతో దర్గా వద్దకు వెళ్లి సదరు భిక్షపతికి చెప్పడంతో మంత్రించిన పసరు మందు ఇచ్చి నాటు వైద్యం చేశాడు. అదే సమయంలో రాజరాజేశ్వరిని తన కోరిక తీర్చాలని అడగడంతో అందుకు ఆమె నిరాకరించి తిరిగి దురాజ్ పల్లికి వచ్చేసింది. నాలుగు రోజుల క్రితం శ్రావణి తిరిగి అనారోగ్యానికి గురై కళ్ళు తిరిగి పడిపోయింది. విషయాన్ని దర్గా నిర్వాహకుడుకి తెలిపిన కుటుంబ సభ్యులు భిక్షపతి వారిని వారించి తన దగ్గరకు తీసుకురావాలని, తానే నయం చేస్తానని చెప్పడంతో సోమవారం రాత్రి గాంధీ నగర్ దర్గాకు శ్రావణిని తీసుకెళ్లారు. వైద్యానికి సమయం పడుతుందని రాత్రికి ఇక్కడే నిద్రించాలని చెప్పడంతో భార్యను అక్కడే ఉంచి దుర్గయ్య ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దర్గా నిర్వాహకుడు తిరిగి తన కోరిక తీర్చాలని రాజరాజేశ్వరిని అడిగాడు. తన కోరిక తీరుస్తేనే కూతురు శ్రావణికి వైద్యం కొనసాగిస్తానని.. లేదంటే వైద్యం చేయమని అల్టిమేటం ఇచ్చాడు. అయినా రాజరాజేశ్వరి అందుకు అంగీకరించలేదు. తెల్లారి చూసేసరికి శ్రావణి మృతి చెంది ఉండటంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పిన రాజరాజేశ్వరి, కోరిక తీర్చకపోవడంతోనే మంత్రాలు చేసి తమ కూతురిని చంపాడంటూ భిక్షపతిని నిర్బంధించారు కుటుంబ సభ్యులు.

ఆందోళన చేసిన కుటుంబ సభ్యులు

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా మృతురాలి బంధువులు అడ్డగించి తమకు ఇక్కడే న్యాయం చేయాలని పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. తమ కూతురిని చంపినట్లుగానే దర్గా నిర్వాహకుడిని చంపాలని, అమాయక ప్రజలను, మహిళలను నాటు వైద్యం, మంత్రాల పేరుతో మోసం చెస్తున్న భిక్షపతికి అదే సరైన శిక్ష అని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.

ఇంట్లో నగ్నంగా రెచ్చిపోయిన భార్య, ఆమె ప్రియుడు.. సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలు చూసి భర్త షాక్


Next Story

Most Viewed