వార్నింగ్.. అలా చేసినందుకే స్టార్ హీరోపై బ్యాన్?

by  |
వార్నింగ్.. అలా చేసినందుకే స్టార్ హీరోపై బ్యాన్?
X

దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్‌ను ‘థియేటర్ ఆర్గనైజేషన్ Fiok’ బ్యాన్ చేస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. గత రెండు నెలలుగా తను నటించిన ‘సీ యూ సూన్, డార్క్‌నెస్, జోజి, ఇరుల్’ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే రిలీజ్ అయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన థియేటర్ ఆర్గనైజేషన్ ఇకపై తన సినిమాలను థియేటర్‌లో రిలీజ్ చేసేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇదంతా వాస్తవం కాదని స్పష్టం చేశారు Fiok మెంబర్స్. ఫాహద్ తమతో ఫోన్‌లో కాంటాక్ట్ అయ్యారని, లాక్‌డౌన్‌లో ఓటీటీ కోసం తీసిన సినిమాలనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేశామని చెప్పారని వివరించారు. కరెంట్ టైమ్‌లో ఓటీటీతో కొలాబరేట్ కాలేదని కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. కాగా ఫాహద్ బిగ్ బడ్జెట్ మూవీ ‘మాలిక్’ మేలో థియేటర్‌లోనే రిలీజ్ కానుంది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన సినిమాకు ఆంటో జోసెఫ్ నిర్మాత కాగా.. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు.


Next Story

Most Viewed