సారేగామా.. ఇక ఫేస్‌బుక్ హంగామా

by  |
సారేగామా.. ఇక ఫేస్‌బుక్ హంగామా
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకూ కొత్త కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఖుషీ చేస్తున్న ఫేస్‌బుక్.. లేటెస్ట్‌గా ‘సారేగామా’తో జతకట్టింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే స్టోరీలకు, పోస్టులకు ఇకపై పాటలు యాడ్ చేసుకోవచ్చు. ‘పాటలు ఓ వ్యక్తి ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయగలవు. అంతేకాదు మనుషులను దగ్గరకు చేర్చడంతోపాటు ఎన్నో మరిచిపోయిన జ్ఞాపకాలను మన ముందుకు తీసుకొచ్చి, మరెన్నో తీపి గుర్తులను అందించగలవు. సారేగామాతో జత కట్టినందుకు మాకెంతో ఆనందం, గర్వంగా ఉంది. మా యూజర్లు ఇకపై తమ ఫేవరెట్ పాటలను తమ కంటెంట్‌కు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు’ అని ఫేస్ బుక్ ఇండియా డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టా యూజర్లు సారేగామాలోని లక్షకు పైగా సాంగ్స్‌ను తమ కంటెంట్‌కు వాడుకోవచ్చు. సినిమా పాటలు, భక్తి గీతాలు, గజల్స్, ఇండీ పాప్.. ఇలా 25 భాషలకు చెందిన ఎన్నో పాటలను వాడుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆ పాటలను ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌గా కూడా పెట్టుకునే అవకాశం ఉంది.

లెజెండ్స్ గీతాలు

ప్రపంచంలోనే పేరుపొందిన మ్యూజిక్ లేబుల్స్‌లో సారేగామా కూడ ఒకటి. సారేగామా పాటల లైబ్రరీలో లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, ఆశా భోంస్లే, గుల్జార్, జగ్జీత్ సింగ్, ఆర్డీ బర్మన్, కల్యాన్ జీ ఆనంద్ జీ, గీతా దత్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి లెజెండ్స్ పాడిన పాటలు అందుబాటులో ఉన్నాయి.

గతంలోనూ

ఫేస్‌బుక్ గతంలోనూ.. టీ సిరీస్, యష్ రాజ్ ఫిల్మ్స్, జీ మ్యూజిక్‌లతో డీల్స్ కుదుర్చుకుంది. అంతేకాదు త్వరలో ఇంటర్నేషనల్ మ్యూజిక్ లేబుల్స్ అయిన వార్నర్ మ్యూజిక్, యూనివర్సల్‌లతో కూడా ఫేస్‌బుక్ చర్చలు జరుపుతుందని సమాచారం. డీల్ ఓకే అయితే ఆయా కంపెనీలకు చెందిన మ్యూజిక్ కేటలాగ్ కూడా ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.



Next Story

Most Viewed