ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తు  గడువు పొడిగింపు

by  |
iti
X

దిశ కొండపాక : ఐటిఐ లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరడం అయింది. ఇందులో చేరేందుకు ఈ విద్యా సంవత్సరానికి ఐదో విడత అవకాశం ఈ నెల 22వ తేదీన ముగిసింది. అయితే ఈ అవకాశాన్ని మరో ఐదు రోజులు పాటు అంటే 27వ తేదీ వరకు పొడిగిస్తు ప్రకటన విడుదల చేసింది. కావున పదవ తరగతి పాసైన విద్యార్థినీ విద్యార్థులు ఇచ్చిన గడువులోపు http://iti.telangana.gov.in అనే వెబ్ సైట్ లో మీ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఐటిఐ సీటు కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ డి వెంకటరమణ తెలిపారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి కుకునూరుపల్లి ఐటిఐ నందు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ,వెల్డర్, మెకానిక్ డీజిల్, కోపా( కంప్యూటర్) ట్రేడ్ ల యందు ప్రవేశాలు దాదాపుగా 130 సీట్లు మిగిలి ఉన్నయని స్థానిక విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Next Story

Most Viewed