కొత్త వాహనాలతో మెరుగైన అమ్మకాలు : టయోటా కిర్లోస్కర్!

32

దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో కొత్త వాహనాలు, ఆర్థిక పునరుజ్జీవనం వంటి వివిధ అంశాల నేపథ్యంలో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ హోల్‌సేల్ అమ్మకాలు 6 శాతం పెరిగాయని కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే డిసెంబర్‌లో అమ్మకాలు 14 శాతం పెరిగి 7,487 యూనిట్లుగా నమోదయ్యాయి.

‘జనవరిలో సైతం డిమాండ్ ఇదే ధోరణిలో కొనసాగుతుందని నమ్ముతున్నాం. ఇప్పటికే మూడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టం. 2020 కంటే 2021 నుంచి అమ్మకాల పరంగా మెరుగైన ఏడాదిగా ఉంటుందని విశ్వసిస్తున్నామని’ టీకేఎం సేల్స్ అండ్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ సోనీ చెప్పారు. ఆర్థికవ్యవస్థలో పునరుజ్జీవనం 2021లో ఆమకాల వేగాన్ని కొనసాగించేందుకు సహాయపడుతుంది. పరిశ్రమ తిరిగి బౌన్స్ అయ్యేందుకు తోడ్పాటునందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతవారం ప్రవేశపెట్టిన కొత్త ఫార్చ్యునర్‌తో పాటు టీకేఎం ఇన్నోవా క్రిస్టా, కాంపాక్ట్ ఎస్‌యూవీ అర్బన్ క్రూజర్ కొత్త వెర్షన్‌లు ఇటీవలే మార్కెట్లో విడుదల అయిన సంగతి తెలిసిందే. తమ కొత్త వాహనాలు ప్రీమియం సెగ్మెంట్‌లో మార్కెట్ వాటాను మరింత పదిలం చేసుకునేందుకు సహాయపడుతుందని నవీన్ సోని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..