- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండోరోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. నిన్న చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పై చర్చ సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం నెలకొంది. అంతేకాకుండా, కాసేపు స్పీకర్ తమ్మినేని సీతారం, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం చర్చ కొనసాగించగా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. నిన్న చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో టిడ్కో ఇళ్ల పై చర్చ సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్దం నెలకొంది.
అంతేకాకుండా, కాసేపు స్పీకర్ తమ్మినేని సీతారం, చంద్రబాబు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం చర్చ కొనసాగించగా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. చర్చ సజావుగా జరగకుండా అడ్డుకోవడంతో స్పీకర్ తమ్మినేని చంద్రబాబు మినహా 12 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఒకరోజు సస్పెన్షన్ విధించారు. దీంతో వారిని మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటకు పంపించి వేశారు.
Next Story






