‘వకీల్ సాబ్‌’కు విషెస్ వెనుక అసలు కథ ఇదా.. ఆలియా!

81

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గంగుబాయి కతియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియాలో లార్జెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటిగా వెలుగొందుతున్న టాలీవుడ్‌‌లోనూ(తెలుగులో) ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు భన్సాలీ.

ఈ నేపథ్యంలోనే గంగూబాయికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను యాడ్ చేస్తే, ఆడియన్స్‌ రీచ్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఎక్సలెంట్ థాట్‌తో ముందుకొచ్చారు. ఈ మేరకు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టేందుకు రెడీగా ఉన్న ‘వకీల్ సాబ్’ సినిమాకు ‘గంగుబాయి కతియావాడి’ టీజర్‌ను అటాచ్ చేసే ఆలోచన చేశారు. దీంతో ‘వకీల్ సాబ్’ ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందో.. అన్ని చోట్లా ఆ సినిమాకు ముందు గంగూబాయి టీజర్‌ను ప్రదర్శించనున్నారు. ఈ విధంగా ఆలియా సినిమాకు వైడర్‌ పాపులారిటీ లభించనుంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..