- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటైన్‌మెంట్ ప్రాంతాలపై డ్రోన్లతో నిఘా
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ అమలులో భాగంగా నిజామాబాద్ నగరంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పోలీసు అధికారులు పరిశీలించారు. ఫ్రూట్ మార్కెట్, ఆటోనగర్, మాలపల్లిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయా ఏరియాల్లో ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారనే విషయమై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైవ్ మానిటరింగ్ చేసి అనవసరంగా రోడ్డుపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. పని […]</p>

X
దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ అమలులో భాగంగా నిజామాబాద్ నగరంలోని కంటైన్‌మెంట్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పోలీసు అధికారులు పరిశీలించారు. ఫ్రూట్ మార్కెట్, ఆటోనగర్, మాలపల్లిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ కార్తీకేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఆయా ఏరియాల్లో ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారనే విషయమై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఏసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైవ్ మానిటరింగ్ చేసి అనవసరంగా రోడ్డుపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. పని లేకుండా రోడ్లపై తిరిగే వారి బైకులను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
Tags: Nizamabad, continement areas, drone cameras, Acp
Next Story






