క్యాబినెట్ మీటింగ్‌లోనే లాక్‌డౌన్‌పై నిర్ణయం

by  |
క్యాబినెట్ మీటింగ్‌లోనే లాక్‌డౌన్‌పై నిర్ణయం
X

దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ విషయమై ఎలా ముందుకు సాగాలో ఈ నెల 5న జరుగనున్న క్యాబినెట్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు శనివారం సిరిసిల్ల జిల్లాలో ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ తాను క్షేత్రస్థాయిలో గమనించిన ప్రతి విషయాన్ని సీఎంకు వివరిస్తానన్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో దెబ్బతిన్నాయన్నారు. రైతులకు జరుగుతున్న నష్ట నివారణ కోసం లోతైన పరిష్కారం ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో రైతు బీమా తెచ్చామన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్లు ఇప్పుడు ఇండియాకు వచ్చే పరిస్థితులు లేవని, అంతర్జాతీయంగా రవాణా సౌకర్యాలు పునరుద్ధరిస్తేనే వారిని స్వదేశానికి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పవర్ లూం పరిశ్రమల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వారికి చేతినిండా పని కల్పించేలా చూడాలని కోరారు.

Tags: Rajanna siricilla,Ex mp vinodkumar,lockdown,decision

Next Story

Most Viewed