దేశద్రోహిగా ముద్రవేయబడిన సైంటిస్ట్‌‌ను కలిసిన మోడీ

by  |
దేశద్రోహిగా ముద్రవేయబడిన సైంటిస్ట్‌‌ను కలిసిన మోడీ
X

దిశ, సినిమా : హీరో మాధవన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం ‘రాకెట్రీ’. ఎక్స్ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ కాగా గ్రేట్ అప్లాజ్ అందుకుంది. ఒక గొప్ప దేశభక్తుడు.. దేశద్రోహిగా ఎలా ముద్రవేయబడ్డాడు అనేది సినిమా కథ కాగా, సినిమా ట్రైలర్ చూశాక ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి తమకు ఆహ్వానం అందిందని తెలిపాడు మాధవన్. ఈ మేరకు సైంటిస్ట్ నంబి నారాయణ్‌, తాను మోడీని కలిశామని.. ఈ సందర్భంగా ఆయన ‘రాకెట్రీ’ గురించి మాట్లాడారని తెలిపాడు. సినిమా క్లిప్స్‌పై బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన మోడీ.. నంబి నారాయణ్‌కు జరిగిన అన్యాయం గురించి ఫీల్ అయ్యాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు మోడీ నుంచి ఇలాంటి గౌరవం పొందడం ఆనందంగా ఉందని వెల్లడించాడు. ఈ సినిమాలో సైంటిస్ట్ నంబి జీ పాత్రలో మాధవన్ కనిపించబోతుండగా.. సూర్య, షారుఖ్ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


Next Story

Most Viewed