కేంద్రానికి వ్యతిరేకంగా కవిత నిరసన

by  |
కేంద్రానికి వ్యతిరేకంగా కవిత నిరసన
X

దిశ, న్యూస్‌బ్యూరో: బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ, టీబిజీకేయస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గు గనుల వద్ద 26న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేసి నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న 42 బొగ్గు గనులకు ప్రైవేటీకరించడాన్ని టీఆర్‌ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 26 కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా అన్ని గునుల వద్ద కార్మికులతో నిరసనలు వ్యక్తం చేస్తామని, జులై 2న 24గంటల పాటు సమ్మె చేయనున్నట్టు బుధవారం మాజీ ఎంపీ కవిత ఓ ప్రకటనలో తెలిపారు.


Next Story

Most Viewed