- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ప్రభుత్వం రక్తం పారిస్తోంది: చినరాజప్ప
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న సీమలో వైసీపీ ప్రభుత్వం రక్తం పారిస్తోందని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. చేనేత వర్గం నాయకుడిని కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. కొల్లు రవీంద్రపై మంత్రి పేర్ని నాని రెండు పర్యాయాలు కేసులు పెట్టారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పక్షాన టీడీపీ ఉందన్న అక్కసుతోనే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బలహీన వర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయడానికి జగన్ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. రామగిరిపై రామస్వామి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న సీమలో వైసీపీ ప్రభుత్వం రక్తం పారిస్తోందని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. చేనేత వర్గం నాయకుడిని కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. కొల్లు రవీంద్రపై మంత్రి పేర్ని నాని రెండు పర్యాయాలు కేసులు పెట్టారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పక్షాన టీడీపీ ఉందన్న అక్కసుతోనే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బలహీన వర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయడానికి జగన్ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మొదలు పెట్టిందన్నారు. రామగిరిపై రామస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్మపరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
Next Story






