బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎంలు

by  |
EVM
X

గువహతి: అసోంలో ఓ బీజేప అభ్యర్థి కారులో ఈవీఎంలు లభించినట్టు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పత్తర్‌కండి బీజేపీ అభ్యర్థి క్రిష్ణేందు పాల్ కారులో ఈవీఎంలను చూపిస్తున్న వీడియోను స్థానిక జర్నలిస్టు అతాను భుయాన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అసోంలో రెండో దశ ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే ఈ వీడియో కలకలం రేగడం గమనార్హం.

‘ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంలు కనిపించిన వీడియోలు వస్తున్నాయి. అందులో మూడు అంశాలు సర్వసాధారణంగా ఉంటున్నాయి. 1. ఆ వాహనాలు బీజేపీ అభ్యర్థులవి లేదా వారి సన్నిహితులవై ఉంటున్నాయి. 2. ఆ వీడియోలను చెల్లనివిగా కొట్టిపారేయడం. 3. ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంలను వీడియోల ద్వారా బయటికి తెచ్చినవారిపై బీజేపీ తన మీడియాతో దుష్ప్రచారం చేయడం, పరాజయులుగా నిందించడం’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అంతేకాదు, జాతీయపార్టీలన్నీ ఈవీఎంల వినియోగంపై మరోసారి సమీక్షలు జరపాలని సూచించారు.



Next Story