చేనేతను ఆదరించండి.. నేతన్నను ఆదుకోండి

by  |
చేనేతను ఆదరించండి.. నేతన్నను ఆదుకోండి
X

దిశ, నల్లగొండ: చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబ సమేతంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేతను ఆదరించండి.. నేతన్నను ఆదుకోండి అంటూ పిలుపునిచ్చారు. ఉద్యమం సమయం నుంచే సీఎం కేసీఆర్ చేనేత ఆకలి కేకలపై పోరాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందించారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సరుకు నిల్వలు పేరుకుపోయాయని, అందుకే కుటుంబ సమేతంగా వచ్చి ప్రజాప్రతినిధులందరం చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్, నోముల నర్సింహయ్య, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed