సామాజిక దూరమే శ్రీ రామరక్ష: జగదీశ్‌రెడ్డి

by  |
సామాజిక దూరమే శ్రీ రామరక్ష: జగదీశ్‌రెడ్డి
X

దిశ, నల్లగొండ: సామాజిక దూరమే శ్రీరామరక్ష అని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీరామ నవమి వేడుకలు ఇంటివద్దనే నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ మానవాళి భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నందునే కఠోర నిర్ణయాన్ని అమలు పర్చాల్సి వస్తుందన్నారు. లోక రక్షణకై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. కర్తవ్య నిర్వహణలో శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శమని అటువంటి మహానియుడి అడుగు జాడల్లో పయనించడం మన ముందున్న కర్తవ్యం అన్నారు. ఈ సారి శ్రీ సీతారాముల కల్యాణాన్ని ఇంటి దగ్గర నుండే వీక్షించాలని కోరారు.

Tags: Min Jagadish Reddy, Sri Rama Navami, Ceremonies, Corona Virus Effect, CM KCR

Next Story

Most Viewed