ఆరు నెలల్లో 15 రెట్లు పెరగనున్న ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీ!

63
EV

దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) గిరాకీ రాబోయే ఆరు నెలల కాలంలో ఏకంగా 15 రెట్లు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈవీల కోసం అందించే ప్రోత్సాహకాలు ఈ వృద్ధికి కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ-కామర్స్ సంస్థ తమ డెలివరీ సేవల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా వినియోగించేందుకు సిద్ధపడుతున్నారు. గత 6-9 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు, అవసరం భారీగా పెరగడం చూస్తున్నామని, దేశీయ వాహన మార్కెట్ సైతం దీన్ని గుర్తించిందని ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఫైనాన్స్ చేసే రెవ్‌ఫిన్ వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ చెప్పారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈవీ కొనుగోలును సరసమైనవి, తక్కువ వడ్డీ రేట్లు, సులభ ఈఎంఐ విధానానికి దోహదపడ్డాయి. కొవిడ్‌కి ముందుతో పోలిస్తే ఈ ఏడాది జూలై-ఆగష్టు మధ్య ఈవీ అమ్మ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. రానున్న ఆరు నెలల్లో ఈ డిమాండ్ 15 రెట్లు పెరుగుతుందని ఆశిస్తున్నామని సమీర్ అగర్వాల్ వివరించారు. వృద్ధి ధోరణి మెరుగ్గా ఉంది. రాబోయే 9-12 నెలల్లో ఇది మరింత పెరుగుతుంది. వ్యక్తిగతంగానే కాకుండా వాణిజ్య వినియోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రాధాన్యత ఇవ్వడంతో వచ్చే ఐదేళ్లలో భారత ఈవీ మార్కెట్ రూ. 1-1.5 లక్షల కోట్లకు పెరుగుతుందని సమీర్ అగర్వాల్ వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..