- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటల గెలుపు కోసం మల్లన్నకు పొర్లు దండాలు..
<p>దిశ, ఓదెల : హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవాలని బీజేపీ శ్రేణులు, ముఖ్య అనుచరులు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం ఈటల గెలుపు కోసం మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొర్లుదండాలు పెట్టారు. ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యమం నడిపించిన ఏకైక […]</p>

దిశ, ఓదెల : హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలవాలని బీజేపీ శ్రేణులు, ముఖ్య అనుచరులు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం ఈటల గెలుపు కోసం మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొర్లుదండాలు పెట్టారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యమం నడిపించిన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ అని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నడూ ఆయన్ను మరచిపోరని వివరించారు. ఈనెల 30వ తేదీన జరిగే పోలింగ్‌లో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వీరవేణి శంకరయ్య, ఆచరి ఎర్రయ్య, సత్యం తిరుపతి, కుమార్, శ్రీనివాస్, చంద్రయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






