- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచమ్మ గుడికి వస్తావా? సీఎం కేసీఆర్‌కు ఈటల సవాల్
<p>దిశ, హుజురాబాద్: దళితబంధు వద్దని తాను లేఖ రాయలేదని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ‘చెల్పూర్ పోచమ్మ గుడికి తడి బట్టలు కట్టుకొని వస్తా.. నువ్వు వస్తావా కేసీఆర్’ అంటూ సవాల్ విసిరారు. 70 రోజుల్లో సాధ్యం కాని దళితబంధు ఇంకా 10 రోజుల్లో ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ […]</p>

X
దిశ, హుజురాబాద్: దళితబంధు వద్దని తాను లేఖ రాయలేదని మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ‘చెల్పూర్ పోచమ్మ గుడికి తడి బట్టలు కట్టుకొని వస్తా.. నువ్వు వస్తావా కేసీఆర్’ అంటూ సవాల్ విసిరారు. 70 రోజుల్లో సాధ్యం కాని దళితబంధు ఇంకా 10 రోజుల్లో ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. దళితులపై ప్రేమ ఉంటే రేపే ఖాతాల్లో జమ చేసి కలెక్టర్ల పెత్తనం లేకుండా చేయాలన్నారు. ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. పెన్షన్లు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూంలు ఇవ్వొద్దని ఆపిందెవరని ప్రశ్నించారు. హుజురాబాద్ లో గెలవలేమనే దళిత బంధు తీసుకువచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
Next Story






