హుజూర్‌నగర్ ప్రజలకు గుడ్‌న్యూస్

by Shyam |   (  Updated:2021-07-30 06:21:13  IST  )

<p>దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరుతో హూజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నేరవెరుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉపఎన్నికల అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల సహకారంతో ఆసుపత్రి మంజూరు అయిందని హర్షం వ్యక్తం చేశారు. [&hellip;]</p>

cm-kcr government
X

దిశ, హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరుతో హూజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నేరవెరుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉపఎన్నికల అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల సహకారంతో ఆసుపత్రి మంజూరు అయిందని హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల, కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story