టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంకపై ఇంగ్లాండ్‌ విజయం

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై ఇంగ్లాండ్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌లో జోస్ బట్లర్ ఆది నుంచి అదరగొట్టాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడికి తోడు ఇయాన్ మోర్గాన్ (40) పరుగులతో పెవిలియన్ చేరగా.. స్కోర్ [&hellip;]</p>

టీ20 వరల్డ్‌ కప్‌లో శ్రీలంకపై ఇంగ్లాండ్‌ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై ఇంగ్లాండ్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌లో జోస్ బట్లర్ ఆది నుంచి అదరగొట్టాడు. 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతడికి తోడు ఇయాన్ మోర్గాన్ (40) పరుగులతో పెవిలియన్ చేరగా.. స్కోర్ 163కి చేరింది.

ఇక 164 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు బొక్కబోర్ల పడ్డారు. హసరంగ (34) పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మాన్‌లు పాతుమ్ నిస్సాంక (1), కుశాల్‌ పెరీరా (7), చరిత్ అసలంక (21), అవిష్క ఫెర్నాండో (13) రాజపక్స(26) శనక (26) ‌పరుగులకే విఫలమయ్యారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ వికెట్లు ఇంగ్లాండ్ బౌలర్లు ఈజీగా తీసుకున్నారు. దీంతో 19 ఓవర్లకే 137 పరుగులు చేసిన శ్రీలంక ఆలౌట్‌ కాగా, 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది.

Next Story