ఐపీఎల్‌ను వాడుకోవాలి: ఇయాన్ మోర్గాన్

by  |
ఐపీఎల్‌ను వాడుకోవాలి: ఇయాన్ మోర్గాన్
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది ఇండియాలోనే జరుగుతున్నందున.. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వాడుకోవాలని ఇయాన్ మోర్గాన్ సూచించాడు. ఐపీఎల్‌లో పలువురు ఇంగ్లీష్ క్రికెటర్లు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ జరిగే వేదికల్లోనే ప్రస్తుతం ఐపీఎల్ కూడా నిర్వహిస్తున్నందున.. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని ఇయాన్ అంటున్నాడు. ‘న్యూజీలాండ్, ఇండియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌లు ఆడబోతున్నాము. దాని తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో పరిమిత ఓవర్లు క్రికెట్ ఆడతాము. కానీ ఇది మ్యాచ్ ప్రాక్టీస్‌కు ఏ మాత్రం సరిపోదు. కాబట్టి ఐపీఎల్‌ను ప్రతీ ఇంగ్లాండ్ క్రికెటర్ ఉపయోగించుకోవాలి’ అని ఇయాన్ మోర్గాన్ అన్నాడు. రాబోయే ప్రతీ మ్యాచ్‌లో టీ20 జట్టు క్రికెటర్లతోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడతామని మోర్గాన్ అన్నాడు.

Next Story