5th టెస్టు రద్దు చేసింది ఐపీఎల్‌ కోసం కాదు.. టామ్ క్లారిటీ

by  |
INDvsEND
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్‌ మొదటి రోజు ఆటను ముందుగా వాయిదా వేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అయితే, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ.. మొత్తం టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌కు కరోనా రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ మ్యాచ్‌ను ఐపీఎల్ సమయం దగ్గర పడుతుండటంతోనే రద్దు చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ స్పందించాడు.

ఈ సందర్భంగా టామ్ మాట్లాడుతూ.. బీసీసీఐ ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలి అని అనుకోలేదని స్పష్టం చేశారు. చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని బీసీసీఐ తెలిపినట్లు వెల్లడించారు. అయితే నాలుగో టెస్టు సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మ్యాచ్‌ను ఆపలేదని, కానీ, చివరి టెస్ట్ ప్రారంభానికి మూడు గంటల ముందే భారత జట్టు ఫిజియోకు పాజిటివ్ నిర్ధారణ అయిందని, అందుకే అనుకోని కారణంగా ఈ టెస్టును రద్దు చేశామని ప్రకటించారు. అంతే కానీ ఐపీఎల్ కోసం కాదని టామ్ హారిసన్ తెలిపారు. ఇక ఇప్పటివరకు ఈ సిరీస్‌లో జరిగిన నాలుగు టెస్టులు జరుగగా, అందులో భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Next Story

Most Viewed