విశాఖ AOBలో ఎన్ కౌంటర్..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-12-12 23:32:08  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ :ఏపీలోని విశాఖ ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ (AOB)లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరికి గాయాలైనట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా గుజ్జమామిడి బ్లాక్ సింగారం అటవీ ప్రాంతంలో జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఇరువురి మధ్య ఫైరింగ్ నెలకొందని సమాచారం. ప్రస్తుతం తప్పించుకున్న వారికోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు [&hellip;]</p>

విశాఖ AOBలో ఎన్ కౌంటర్..
X

దిశ, వెబ్‌డెస్క్ :ఏపీలోని విశాఖ ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ (AOB)లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, మరికొందరికి గాయాలైనట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా గుజ్జమామిడి బ్లాక్ సింగారం అటవీ ప్రాంతంలో జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఇరువురి మధ్య ఫైరింగ్ నెలకొందని సమాచారం. ప్రస్తుతం తప్పించుకున్న వారికోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story