ఆర్థిక కార్యకలాపాల రికవరీతో మెరుగుపడిన ఉపాధి

by  |
CMIE 1
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా మొత్తం 2.27 కోట్ల ఉద్యోగాలు నష్టపోగా, వాటిలో 78 లక్షల ఉద్యోగాలు కోలుకున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. జూన్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడమే దీనికి కారణమని సీఎంఐఈ అభిప్రాయపడింది. గత నెలలో దేశంలోని మొత్తం ఉపాధి 38.3 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ‘జూన్‌లో ఉపాధి మెరుగుపడటం, ముఖ్యంగా వ్యవసాయేతర ఉపాధి పెరుగుదల ఆశాజనకంగా ఉండటంతో ఉపాధి రికవరీ నమోదవుతున్నట్టు సీఎంఐఈ వివరించింది.

తిరిగి కోలుకున్న మొత్తం 78 లక్షల ఉద్యోగాల్లో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాల్లోనే జరిగాయని, వీరిలో వేతనాలు కలిగిన వారే అధికంగా ఉన్నారని తెలిపింది. కీలక రంగాల్లో రిటైల్ పరిశ్రమల్లో మొత్తం ఉపాధి 1.12 కోట్లకు పెరగ్గా, ఇందులో 75 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనూ, 37 లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. నిర్మాణ రంగంలో మే నెలతో పోలిస్తే జూన్‌లో 22 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. టెక్స్‌టైల్స్ పరిశ్రమలో 21 లక్షల ఉద్యోగాలు కొత్తగా చేరాయి. జూన్‌లో తయారీ రంగంలో కొత్తగా 37 లక్షలు, సేవల రంగంలో 69 లక్షల ఉద్యోగాలు పెరిగాయని సీఎంఐఈ తెలిపింది. అయితే, వ్యవసాయ రంగంలో ఉపాధి కొంతమేర క్షీణించిందని సీఎంఐఈ వెల్లడించింది.


Next Story

Most Viewed