షూటింగ్ సమయంలో అండర్‌వెయిర్ ధరించడం ఇష్టం ఉండదన్న నటి

by  |
Emma Thompson
X

దిశ, సినిమా : బ్రిటిష్ యాక్ట్రెస్ ఎమ్మా థాంప్సన్ నటించిన ‘క్రూయెల్లా’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచగా.. ఫ్యాషన్ లెజెండ్ బారోనెస్ వాన్ హెల్మాన్ క్యారెక్టర్‌లో థాంప్సన్ కనిపించబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. హాట్ హాట్ కామెంట్స్ చేసింది.

షూటింగ్ చేస్తున్న సమయంలో టార్చర్ అంటే ఏంటో అర్థమైందని తెలిపింది. 62 ఏళ్ల థాంప్సన్ తనకు అండర్‌వెయిర్(లోదుస్తులు) ధరించడం అసలు ఇష్టం లేదని, ఇది శ్రమతో కూడుకున్న పని అని తెలిపింది. చాలా కాలం క్రితమే లోదుస్తులు వాడటం మానేశానన్న థాంప్సన్.. ఈ సినిమా కోసం పనిచేస్తున్నప్పుడు ధరించినా, తన సీన్ లేనప్పుడు కూడా అండర్‌వెయిర్ వేసుకోవడం టార్చర్ అనిపించిందని చెప్పింది. అంతేకాదు అండర్‌గార్మెంట్స్‌ను టూత్‌పేస్ట్ టబ్‌తో పోల్చుతూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

Next Story

Most Viewed