ఎలీ ‘ప్యాంట్’.. ఫ్యాన్సీ డ్రెస్సులో పరేషాన్ చేస్తున్న ఏనుగు !

by Sujitha Rachapalli |
Elephant Wearing Shirt & Pants
X

దిశ, ఫీచర్స్ : ప్యాంట్, షర్ట్ వేసుకున్న ఏనుగును చూశారా? బహుషా సినిమాల్లో తప్ప ఎక్కడా చూసుండరు. కానీ ఇక్కడొక ఏనుగు ప్యాంట్, షర్ట్ ధరించడంతో పాటు టక్ చేసుకున్న పిక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆ ఏనుగు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఇన్‌క్రెడిబిల్ ఇండియా.. ఎలీ‘ప్యాంట్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడిన ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏనుగు ఈ దుస్తుల్లో కంఫర్టబుల్‌గానే ఉందా? అని ఒకరు ప్రశ్నిస్తుంటే.. ఈ ఏనుగు ఫ్యాషన్ కాన్షియస్ అని మరొకరు పోస్టు పెట్టారు. ఇది తమిళనాడులోని తిరుచూరుపల్లి సిటీ మెయిన్ గార్డ్ గేట్ ఏరియా వద్ద ఉండే ఏనుగని మరో యూజర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story