- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజిల్ ట్యాంకర్ ఢీకొని విద్యుత్ ఉద్యోగి మృతి
<p>దిశ, మానకొండూరు : ప్రమాదవశాత్తు ట్యాంకర్ ఢీకొట్టడంతో విద్యుత్ శాఖ లైన్‌మెన్ మృతి చెందాడు. ఈ ఘటన కేశపట్నం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కేశపట్నం ఎస్ఐ తోట తిరుపతి కథనం ప్రకారం.. మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన జంగిలి సంపత్ అనే వ్యక్తి తాడికల్ సబ్‌స్టేషన్ పరిధిలోని అంబాల పూర్, వంకాయ గూడెం లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో వంకాయ గూడెం శివారులో జాతీయ రహదారిపై […]</p>

దిశ, మానకొండూరు : ప్రమాదవశాత్తు ట్యాంకర్ ఢీకొట్టడంతో విద్యుత్ శాఖ లైన్‌మెన్ మృతి చెందాడు. ఈ ఘటన కేశపట్నం మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కేశపట్నం ఎస్ఐ తోట తిరుపతి కథనం ప్రకారం.. మండలంలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన జంగిలి సంపత్ అనే వ్యక్తి తాడికల్ సబ్‌స్టేషన్ పరిధిలోని అంబాల పూర్, వంకాయ గూడెం లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
డ్యూటీ ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో వంకాయ గూడెం శివారులో జాతీయ రహదారిపై కరీంనగర్ నుండి వరంగల్‌కు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వాహనదారుడు సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కేశపట్నం ఎస్ఐ తోట తిరుపతి, ట్రైనింగ్ ఎస్ఐ తాళ్లపల్లి సుమన్, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని హుజురాబాద్ మార్చురీకి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం డీజిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.






